గుంటూరు: తనపై వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం దారుణమని ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అన్నారు. తన సొంత నియోజక వర్గం సత్తెనపల్లి పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారంతో అక్కడికి వెళ్లానని,తీరా వెళ్లగానే వైసీీపీ నేతలు తనపై దాడికి పాల్పడ్డారన్నారు. పోలింగ్ అధికారులు తలుపులు వేస్తే వాటినీ కూడా వైసీపీ కార్యకర్తలు పగులగొట్టారని చెప్పారు. ఆ పార్టీ నాయకులు ఇలా దౌర్జన్యం చేస్తారని ముందే ఊహించానని, ఈవిధంగా దాడులు చేయడం, ఇన్నేళ్లలో మొదటిసారిగా చూస్తున్నానని అన్నారు. ‘నాకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు.
