బీజేపీ ఎమ్మెల్యేలను సభలో నుంచి ఎత్తుకెళ్లిన మార్షల్స్

బీజేపీ ఎమ్మెల్యేలను సభలో నుంచి ఎత్తుకెళ్లిన మార్షల్స్

అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యే ఈటల రాజేందర్,రాజాసింగ్,రఘునందన్ రావులను బడ్జెట్ సెషన్ మొత్తానికి  సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. హరీశ్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దీంతో ముగ్గురు సభ్యులను అసెంబ్లీ నుంచి బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్.  బీజేపీ ఎమ్మెల్యేలను సభ లో నుంచి ఎత్తుకెళ్లారు మార్షల్స్.