మేడారం జాతరలో పంచాయతీ ఆఫీసర్లకు స్పెషల్ డ్యూటీలు! : పంచాయతీ రాజ్ శాఖ

మేడారం జాతరలో పంచాయతీ  ఆఫీసర్లకు స్పెషల్ డ్యూటీలు! : పంచాయతీ రాజ్ శాఖ
  •     24 నుంచి ఫిబ్రవరి 2 వరకు అక్కడే విధులు
  •     పంచాయతీ రాజ్ ​శాఖ ఆదేశాలు జారీ

హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క -సారలమ్మ మహాజాతర -2026 కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర జరగనున్న నేపథ్యంలో జాతరలో పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ ఫోకస్​ పెట్టింది. 

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ ఆఫీసర్లను (డీపీవోలు) జోనల్ కోఆర్డినేటర్లుగా, 40 మంది డివిజనల్ పంచాయతీ ఆఫీసర్లను (డీఎల్​పీవోలు) సెక్టోరల్ కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరంతా ఈ నెల 24న ఉదయం 10 గంటల కల్లా ములుగు 
కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్ చేయాలి. 24 నుంచి ఫిబ్రవరి 2 జాతర ముగిసేంత వరకు విధుల్లో ఉండాలి. 

ములుగు డీపీవోతో సమన్వయం చేసుకుంటూ 24 గంటలు పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలి. జాతర డ్యూటీ వేసిన అధికారులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఉత్తర్వులు ధిక్కరిస్తే కఠినమైన డిసిప్లినరీ యాక్షన్ తప్పదని పంచాయతీరాజ్​శాఖ హెచ్చరించింది. ములుగు కలెక్టర్ కోరిన వెంటనే ఆయా జిల్లాల నుంచి ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులను రిలీవ్ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది.