ఆరు గ్యారెంటీల కోసం రూ.53 వేల 196 కోట్లు

ఆరు గ్యారెంటీల కోసం రూ.53 వేల 196 కోట్లు

ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో అంచనా వ్యయాలను ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఆరు గ్యారంటీలను అమలు చేయటానికి 53 వేల 196 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధులను బడ్జెట్ లోనే కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు మంత్రి. బడుగు, బలహీన వర్గాలు, మహిళల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారాయన. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. ఆరు గ్యారంటీలను అమలు చేయటం అనేది అత్యంత ప్రాధాన్యతకు ప్రకటించారు మంత్రి భట్టి విక్రమార్క. ఈ పథకాల ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారంటీల్లో.. రెండు గ్యారంటీలను 48 గంటల్లోనే అమలు చేసినట్లు వెల్లడించారాయన. ప్రజా పాలన కింద గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఇప్పటికే 400 కోట్ల రూపాయలు కేటాయించటం జరిగిందన్నారు మంత్రి.

ఆరు గ్యారంటీల కోసం కేటాయించిన 53 వేల 196 కోట్ల రూపాయలను సమర్థవంతంగా పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారాయన.