గాణగాపూర్‌, భద్రాచలం – జోగులాంబకు.. కుషాయిగూడ నుంచి ప్రత్యేక యాత్రా బస్సులు

గాణగాపూర్‌, భద్రాచలం – జోగులాంబకు.. కుషాయిగూడ నుంచి ప్రత్యేక యాత్రా బస్సులు

కుషాయిగూడ/మల్కాజ్‌గిరి, వెలుగు:వారాంతపు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీల్లో భాగంగా టీజీఎస్‌ఆర్టీసీ కుషాయిగూడ డిపో నుంచి వచ్చే నెలలో రెండు ప్రత్యేక యాత్రా బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిపో మేనేజర్‌ వి.వేణుగోపాల్‌ తెలిపారు. అక్టోబర్​ నెల 1న గురువారం గాణగాపూర్‌ యాత్రకు, 2న శుక్రవారం భద్రాచలం–జోగులాంబ యాత్రకు ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నట్లు చెప్పారు.

మూడు రోజుల గాణగాపూర్‌ యాత్రలో గాణగాపూర్‌, పండరీపూర్‌, తుల్జాపూర్‌, కొల్హాపూర్‌ పుణ్యక్షేత్రాలను సూపర్‌ లగ్జరీ బస్సులో దర్శించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్యాకేజీకి తలసరి టికెట్‌ ధర రూ.3,500గా నిర్ణయించినట్లు వివరించారు.

అదేవిధంగా రెండు రోజుల భద్రాచలం, మూడు రోజుల జోగులాంబ యాత్ర ప్యాకేజీల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను మెట్రో డీలక్స్‌ బస్సులో దర్శించుకోవచ్చని, వీటి తలసరి టికెట్‌ ధర రూ.2 వేలు ఉంటుందని పేర్కొన్నారు. భోజన వసతి ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని మేనేజర్‌ స్పష్టం చేశారు. ముందస్తు టికెట్ల రిజర్వేషన్‌ కోసం 9603549388 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.