నిందితుడి కోసం పోలీసుల గాలింపు.. ఆటోలు, బస్సులకు పోస్టర్లు

V6 Velugu Posted on Sep 15, 2021

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నేషనల్ హైవేలపై చెకింగ్ చేస్తున్నారు. సిసి కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పది లక్షల రివార్డు కూడా ప్రకటించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో, ఆర్టీసీ బస్సులు , ఆటో లకు నిందితుడి సమాచారం తెలపాలంటూ పోస్టర్లు అతికిస్తున్నారు. నారాయణగూడ లోని శాంతి థియేటర్ లైన్ లో , పలు వైన్ షాపుల ముందు నారాయణగూడ పోలీసులు రాజు పోస్టర్లు పెడుతూ, పంప్లేట్లు పంచిపెట్టారు. ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. నిందితున్ని ఎక్కడ చూసినా వెంటనే ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. 

 

Tagged Special Report, Police Search Operation , Saidabad Girl Incident Issue

Latest Videos

Subscribe Now

More News