సరయూ నదిలో సోలార్ బోట్‌.. 45ని.ల్లో అయోధ్య చేరుకోవచ్చు

సరయూ నదిలో సోలార్ బోట్‌.. 45ని.ల్లో  అయోధ్య చేరుకోవచ్చు

అయోధ్య జనవరి 22న శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు సిద్ధమవుతోంది. దీని కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సన్నాహాల్లో భాగంగా మతపరమైన నగరాన్ని మోడల్ సోలార్ సిటీగా మారుస్తోంది.

నదిలో సోలార్ బోట్

సరయూ నదిలో సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ బోట్‌ను ప్రారంభించారు. నదిలో సోలార్ బోట్‌ను ప్రవేశపెట్టడం భారతదేశంలోనే ఇదే తొలిసారి. ఈ పర్యావరణ అనుకూల బోట్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన న్యూ ఎనర్జీ డెవలప్‌మెంట్ అథారిటీ (UPNEDA), పూణేకు చెందిన పడవ తయారీ సంస్థ మధ్య సహకారంతో నడవనుంది. అయోధ్య తర్వాత వారణాసిలోని గంగా నదిలో కూడా త్వరలోనే సోలార్ బోట్‌ను ప్రారంభించనున్నారు.

సోలార్ బోట్ ప్రత్యేకత

సోలార్ బోట్ ఇటీవలి కాలంలో అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. కాలుష్యానికి కారణమయ్యే శిలాజ ఇంధనాలతో నడిచే సాంప్రదాయ పడవలు కాకుండా, ఈ క్లీన్ ఎనర్జీ బోట్ 100 శాతం సౌరశక్తితో పనిచేస్తుంది. ఇది ఫైబర్‌గ్లాస్ తో ఉండనుంది. ఇది తేలికైనప్పటికీ భారీ-కార్యకలాపాలను నిర్వహించగలదు.

సోలార్ బోట్ విశేషాలు

  •     ఈ పడవలో 30 మంది ప్రయాణికులు ఉంటారు. సరయూ నదిపై ఉన్న అయోధ్య కొత్త ఘాట్ నుండి ఈ పడవ నడుస్తుంది.
  •     భక్తులు ఈ పడవ ద్వారా సుమారు 45 నిమిషాలలో అయోధ్య చేరుకోవచ్చు. సరయూ ఒడ్డున ఉన్న చారిత్రక దేవాలయాలు, వారసత్వ ప్రదేశాలను అన్వేషించవచ్చు.
  •     ఫుల్ ఛార్జింగ్ తో సోలార్ బోట్ 5 నుంచి 6 గంటల పాటు నడపవచ్చు.

సోలార్ బోట్ స్పెసిఫికేషన్స్

  •     పడవలో 550 వాట్ల శక్తిని ఉత్పత్తి చేసే 3.3-కిలోవాట్ రూఫ్‌టాప్ సౌర ఫలకాలను అమర్చారు.
  •     ఇది 46-కిలోవాట్-గంట బ్యాటరీతో రన్ అయ్యే 12-వోల్ట్ ట్విన్ మోటార్‌ను కలిగి ఉంది.
  •     దీని వేగం 6 నాట్ల నుండి 9 నాట్ ల వరకు ఉంటుంది.
  •     ఇది రిమోట్ వీక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఎక్కడి నుండైనా తనిఖీని అనుమతిస్తుంది.