ట్రైన్ పబ్ ఉందన్న సంగతి తెలుసా.. జర్నీ చేస్తూ డ్రింక్ ఏస్తూ ఎంజాయ్..

ట్రైన్ పబ్ ఉందన్న సంగతి తెలుసా.. జర్నీ చేస్తూ డ్రింక్ ఏస్తూ ఎంజాయ్..

మనసు బాగోలేనప్పుడు నైట్ క్లబ్బులకో లేక పబ్బులకో వెళ్తుంటారు కొందరు. అక్కడికి వెళ్లి పని బారాన్నంతా తగ్గించుకొని కాసింత రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసి వస్తారు. హైదరాబాద్ లాంటి సిటీలో అయితే పబ్ అనగానే బోలెడు గొడవలు.. బయటకు వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లు.. ఇలాంటి తలనొప్పులు ఎన్నో.. ఇలాంటివి ఏమీ లేకుండా.. ఎంచక్కా ఓ ట్రైన్ పబ్ తీసుకొచ్చింది జర్మనీ దేశం. అది రైలే.. కాకపోతే పబ్ రైలు. అందులో ఎక్కే వాళ్లంతా తాగటానికి.. ఎంజాయ్ చేయటానికే ఎక్కుతారు.. 

ALSO READ | వారంలో మూడోసారి.. 4.3 తీవ్రతతో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం

ఈ ట్రైన్ పబ్ జర్నీ ఏడు గంటలు ఉంటుంది.. ఈ ఏడు గంటలు మీ ఇష్టం.. ప్రపంచానికి దూరంగా.. జర్నీ చేస్తూ పబ్ లో ఎంజాయ్ చేయొచ్చు. డీజే ఉంటుంది.. కావాల్సిన ఫుడ్.. బోలెడ్ ప్లేవర్స్ లో లిక్కర్.. ఇంకా దమ్ము కొట్టటానికి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సిగరెట్లు.. ఇంకా చాలానే ఉంటాయి. ఫుల్ గా తాగాలి తాగింది దిగేదాక ఊగాలి అన్నట్టుగా ట్రైన్ లో వెళ్తుండాలి. విహర యాత్ర ప్రదేశాలు చూడాలి ఎంజాయ్ చేసి రావాలి..ఇంతకు ఆ ట్రైన్ ఎక్కడుందంటే..

ప్రపంచంలోనే జర్మనీ దేశంలో మొదటిసారి పబ్ రైలు నడుస్తుంది. జర్మనీలోని న్యూరెంబర్గ్ నుండి సాయంత్రం వేళల్లో టెక్నో రైలు నురేమ్‌బెర్గ్ నడుస్తుంది. ఏడు గంటల నాన్ స్టాప్ ప్రయాణాన్ని అందిస్తుంది.  సాయంత్రం ఈ రైలులోకి ప్రవేశించి సంగీతంతో సరిపడ చిందులువేస్తు ఫుల్ గా మధ్యపానంలో మునిగితేలుతు నైట్ క్లబ్ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్లాలి. ఈ రైలు ఎక్కడం ఓ ప్రత్యేకమైన అనుభూతి అని ప్యాసింజర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ✦ ???? (@_likealeaf)