
హైదరాబాద్సిటీ, వెలుగు: తమిళనాడులోని తిరుపూరులో జరిగే వెలంకన్ని మేరీ మాతా ఫెస్టివల్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. తిరుపూర్– చర్లపల్లి మధ్య 8 స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నట్టు రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు.
ట్రైన్ నంబర్ 07091 చర్లపల్లి – తిరుపూర్ కు బుధవారం, సోమవారం ఉదయం 8:10 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు తిరుపూర్ చేరుకుంటుందన్నారు. ట్రైన్ నంబర్ 07092 తిరుపూర్ – చర్లపల్లి మధ్య గురువారం, మంగళవారం ఉదయం 10:35 గంటలకు బయల్దేరి రెండో రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు నగరానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోల్, నెల్లూరు, రేణిగుంట, కట్పడి, తిరువన్నమలై, విల్లుపురం, కడ్డలోరు పోర్ట్, చిదంబరం, మైలాదుత్తురాయి, నాగపట్నం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు.