గాల్లో పల్టీలు కొట్టిన కారు..డ్రైవర్ సముద్రంలోకి విసిరేయబడ్డాడు.. అసలేం జరిగిందంటే..

గాల్లో పల్టీలు కొట్టిన కారు..డ్రైవర్ సముద్రంలోకి విసిరేయబడ్డాడు.. అసలేం జరిగిందంటే..

మనం కొన్ని టెరిఫిక్ సీన్స్, గాల్లో కార్లు పల్టీలు కొట్టడం వంటి  దృశ్యాలను సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ రియల్ గా కూడా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇటువంటి సీన్ క సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సీన్ అంతా సినిమా స్టంట్స్ ను తలపించాయి. బీచ్ లో శరవేగంతో దూసుకొస్తున్న కారు..ఒక్కసారిగా గాల్లోకి లేచింది..పల్టీలు కొట్టింది. అచ్చు సినిమాల్లో లాగా కార్లు గాల్లోకి లేచినట్లు ఇక్కడ కూడా కారు గాల్లోనే అనేక సార్లు పల్టీలు కొట్టింది. ఆ తర్వాత సముద్రపు నీటిలో పడిపోయింది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. అన్నిసార్లు కార్లు పల్టీ కొట్టినా డ్రైవర్ ప్రాణాలతో బయటపడటం.. వివరాలేంటో చూద్దాం. 

కువైట్ లోని అబు అల్ హసానియా బీచ్లో కారు అతివేగంతో గాల్లో పల్టీలు కొట్టిన ఘోర ప్రమాదంలో కూడా డ్రైవర్ ప్రాణాలతో నాటకీయంగా బయటపడ్డాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఘటన శనివారం (మార్చి 30) న జరిగినట్లు తెలుస్తోంది. కారు బీచ్ ఒడ్డున నడుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అలలు ఎగిసి పడుతుండగా..34 ఏళ్ల డ్రైవర్ బ్యాలెన్స్ ని కాపాడుకోవడానికి చాలా కష్ట పడుతున్నాడు. కొద్దిసేపటికే కారు ఊగిసలాడింది. దీంతో అది చాలా సార్లు పల్టీలు కొట్టింది. ఒక్కసారిగా డ్రౌవర్ గాల్లోకి విసిరేయబడ్డాడు. తర్వాత సముద్రంలో పడిపోయాడు. అదృష్టం బాగుండి కారునుంచి బయటపడి దూరంగా నీళ్లలో విసిరేయబడటంతో బతికిపోయాడు. 

ఏదీ ఏమైనా అన్నిసార్లు కారు పల్టీలు కొట్టినా.. డ్రైవర్ ప్రాణాలతో బయటపడటం అతడికి భూమ్మీద నూకలున్నాయి కాబట్టే అంటున్నారు నెటిజన్లు.