
దుబాయ్: ఇండియా విమెన్స్ టీమ్ స్పిన్నర్ దీప్తి శర్మ.. టీ20ల్లో కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించింది. మంగళవారం (జులై 08) విడుదలైన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎనిమిది ప్లేస్‌లు మెరుగుపడి రెండో ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 738 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రాణించడం దీప్తి ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది.
గత ఆరేళ్లుగా టాప్–10లో కొనసాగుతున్న దీప్తి రెండో ర్యాంక్‌కు చేరడం ఇదే మొదటిసారి. అనాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా, 736) మూడో ర్యాంక్‌కు పడిపోయింది. సైదా ఇక్బాల్ (పాకిస్తాన్, 746) టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. రేణుకా సింగ్ (706) ఆరో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. పేసర్ అరుంధతి రెడ్డి 11 ప్లేస్‌లు ఎగబాకి 43వ ర్యాంక్‌లో నిలిచింది.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ఆమెకు కలిసొచ్చింది. బ్యాటింగ్‌లో జెమీమా రొడ్రిగ్స్ (631) రెండు ప్లేస్‌లు మెరుగుపడి 12వ ర్యాంక్‌ను సాధించింది. స్మృతి మంధాన (771) మూడో ర్యాంక్‌లోనే ఉంది.