Spotify : టెక్ కంపెనీల బాటలో స్పాటిఫై

Spotify : టెక్ కంపెనీల బాటలో స్పాటిఫై

ఆర్థిక మాంద్యం పేరుతో రోజుకో టెక్ కంపెనీ ఉద్యోగుల్ని తొలగిస్తోంది. తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ జెయింట్ స్పాటిఫై ఆ లిస్టులో చేరింది. కాస్ట్ కట్టింగ్ దృష్ట్యా కంపెనీ నుంచి ఉద్యోగుల్ని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. లేఆఫ్ ప్రక్రియ ఈ వారంలో ఉండవచ్చని చెప్పింది. స్పాటిఫై గత అక్టోబర్ లోనే గిమ్లెట్ మీడియా, పార్కాస్ట్ పోడ్ కాస్ట్ నుంచి 38 మందిని, సెప్టెంబర్ లో ఎడిటోరియల్ డిపార్ట్ మెంట్ నుంచి మరి కొంతమంది ఉద్యోగుల్ని తొలగించింది. అయితే, ప్రస్తుతం ప్రకటించిన లేఆఫ్ లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం స్పాటిఫైలో 9,800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో స్పాటిఫై ఆదాయం భారీగా తగ్గిపోయింది. స్పాటిఫై షేర్లు గతేడాది 66 శాతం పడిపోయాయి. దీంతో అదనపు ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్థికమాంద్యం భయాలు, ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.