హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ శివారులోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారని స్కూల్ డైరెక్టర్ జగన్ మోహన్ తెలిపారు. 900 మార్కులకు ఆర్.అనూప్ రెడ్డి 583, బి.అక్షయ 581, ఎం.విద్యాత్ రెడ్డి 578, కె.సుశాంత్ భరద్వాజ్ 576, జి.శ్రీశాంత్ 573 మార్కులను సాధించగా, మరో నలుగురికి 570 పైగా మార్కులు వచ్చినట్లు చెప్పారు.
560 మార్కులకు పైగా 18 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 30 మంది విద్యార్థులు, 500 మార్కులకు పైగా 131 మంది విద్యార్థులు ఫలితాలను సాధించి ప్రతిభను చాటుకున్నారని, మొత్తం 209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 209 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్ జగన్ మోహన్ అభినందించారు,
