థర్డ్ పార్టీ వద్దు.. డైరెక్ట్ శాలరీ ఇవ్వండి : ఎస్‌‌ పీఎస్

థర్డ్ పార్టీ వద్దు.. డైరెక్ట్ శాలరీ ఇవ్వండి : ఎస్‌‌ పీఎస్
  • మంత్రి దామోదరకు ఎస్‌‌పీఎస్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న తమను కాంట్రాక్ట్ ఏజెన్సీల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని ఎస్‌‌‌‌‌పీఎస్ (శానిటేషన్, పేసెంట్ కేర్, సెక్యూరిటీ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. థర్డ్‌‌ పార్టీ నుంచి కాకుండా డైరెక్ట్‌‌ పద్ధతిలో జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు శనివారం హైదరాబాద్‌‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కమిటీ సభ్యులు కలిశారు. కాంట్రాక్ట్ పేరుతో తమ పొట్ట కొట్టొద్దని, సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.