వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లీ.. అమ్మను భక్తి తో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.. అందుకే మహిళలు శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు.. శ్రావణమాసంలో రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు చేసుకుంటారు. మరి ఆరోజు ఏదైనా అడ్డంకి వస్తే మరి ఎప్పుడు నిర్వహించాలి.. ఈ విషయంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశం ఏమిటి.. పాండవుల భార్య ద్రౌపది వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేశారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..!
శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం వ్రతం చేసుకుంటారు.. కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఆరోజు వ్రతం చేసుకోవడానికి ఏదైనా ఆపద వస్తే ఏమీ బాధ పడాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. ఆ తరువాత చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. దీనికి ఒక పురాణ కథ కూడా ఉందట.
పాండవులు వనవాసం అయిన తరువాత అజ్ఞాతవాసం సమయంలో ద్రౌపది వ్రతం చేస్తే భర్తల పేర్లు.. గోత్రం చెప్పుకోవాలి. ఆమె అలా పూజ చేసేటప్పుడు వారిని ఎవరైనా గుర్తిస్తారనే భయంతో వ్రతం చేయలేదట. తన అన్నగారైన శ్రీకృష్ణుడికి ఈ విషయం చెప్పగా.. ఏమీ చింతించవద్దని చెపుతూ దసరా సమయంలో ఎవరూ నిద్రలేవకముందే ఎవరికీ తెలియకుండా ఈ వ్రతాన్ని చేయమని చెప్పాడు. అప్పుడు నిన్ను ఎవరూ గుర్తించరని... ఆ తరువాత ఎప్పుడు పూజ చేసే సమయంలో ప్రత్యేకంగావరలక్ష్మీ కథను మనసులో చదువుకొని.. అమ్మవారిని ధ్యానం చేయమని చెప్పాడని విరాటపర్వంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.
►ALSO READ | వరలక్ష్మివ్రతం విశేష ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ఎందుకు చేయాలి.. వచ్చే ఫలితాలు ఇవే..!
అమ్మవారికి పూజలను భక్తి శ్రద్దలతో చెయ్యడం వల్ల సుఖ సంతోషాలు వెల్లు విరిస్తాయని పండితులు చెబుతున్నారు.. అందుకే ప్రతి పనిని ఒక నియమం ప్రకారం చెయ్యడం మంచిది.. ఒకవేళ వ్రతం రోజూ అవాంతరాలు వస్తే ఆ తర్వాత వారం అమ్మవారికి వ్రతం చేసుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.. శ్రావణ మాసం అయిపోతే దేవి నవరాత్రుల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చునని చెబుతున్నారు..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
