వరలక్ష్మివ్రతం విశేష ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ఎందుకు చేయాలి.. వచ్చే ఫలితాలు ఇవే..!

వరలక్ష్మివ్రతం విశేష ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ఎందుకు చేయాలి..  వచ్చే ఫలితాలు ఇవే..!

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు నిర్వహించబడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి, వ్రత కథను వినడం, తోరాన్ని కట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిది కంటే ముందు వచ్చే శుక్రవారం( ఆగస్ట్ 21) రోజున వరలక్ష్మీ వ్రతాన్ని పాటిస్తారు. శ్రావణమాసం  సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైనప్పటికీ.. లక్ష్మీదేవిని ఆరాధించడానికి శ్రావణ మాసం శుక్రవారం చాలా ముఖ్యమైనదని నమ్మకం. అందుకే వరలక్ష్మీ వ్రతానికి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది.

వరలక్ష్మీ వ్రత ప్రాముఖ్యత ఏమిటంటే

  • భర్త ఆరోగ్యం, కుటుంబ సంతోషం కోసం అమ్మవారికి మహిళలు ప్రత్యేక వ్రతాన్ని, నోములను చేసుకుంటారు.. కొందరు మహిళలు ఈ పండుగను చాలా సింపుల్​గా జరుపుకుంటే మరికొందరు మాత్రం ఇంట్లో అమ్మవారిని చక్కగా రెడీ చేసి భక్తిశ్రద్ధలతో పూజించి ముత్తైదువులకు వాయనాలు కూడా అందిస్తూ ఉంటారు..
  • వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటుందని.. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని నమ్ముతారు.
  • ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి.
  •  వరలక్ష్మీ వ్రతం ప్రభావం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరాల వారు కూడా చాలా కాలం ఆనందంగా జీవిస్తారని నమ్మకం.
  •  పిల్లలు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడానికి కూడా ఈ ఉపవాసం పాటిస్తారు. సంతానం లేని వివాహిత స్త్రీలు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
  • వివాహిత స్త్రీలకు ఈ ఉపవాసం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.