సినిమాలు, క్యారెక్టర్స్‌‌ మాట అటుంచితే.. బాపు బొమ్మలా శ్రీలీల

సినిమాలు, క్యారెక్టర్స్‌‌ మాట అటుంచితే.. బాపు బొమ్మలా శ్రీలీల

వరుస స్టార్ హీరోల సినిమాలతో ఫుల్‌‌ బిజీగా ఉంది శ్రీలీల. ఈ నెలాఖరులో రవితేజ ‘మాస్‌‌ జాతర’ సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే పవన్ కళ్యాణ్​కు జంటగా ‘ఉస్తాద్‌‌ భగత్‌‌సింగ్‌‌’లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో శివకార్తికేయన్‌‌ ‘పరాశక్తి’,  హిందీలో కార్తిక్ ఆర్యన్‌‌కు జంటగా ఓ సినిమా చేస్తోంది. ఓవైపు అల్ట్రా మోడ్రన్‌‌ కాస్ట్యూమ్స్‌‌తో గ్లామర్‌‌‌‌ రోల్స్‌‌లో ఇంప్రెస్‌‌ చేసే శ్రీలీల.. మరోవైపు ట్రెడిషనల్‌‌ కాస్ట్యూమ్స్‌‌లోనూ అంతే అందంగా ఆకట్టుకోగలదు. 

సినిమాలు, క్యారెక్టర్స్‌‌ మాట అటుంచితే.. రియల్‌‌ లైఫ్‌‌లో ఇలా చీరకట్టుతో సంప్రదాయానికి నిలువెత్తు రూపంలా.. బాపు బొమ్మలా కనిపించిందామె. తాను ఇలా రెండు చేతుల్లో ప్రసాదం పట్టుకోగా, ఆమె పెట్ డాగ్ తనకూ పెట్టమని మారాం చేసిందంటూ క్యూట్‌‌ ఫొటోస్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీలీల. కుందనపు బొమ్మలా కనువిందు చేస్తున్న తన ఫొటోస్‌‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.