
సౌత్ బ్యూటీ శ్రీలీల(Sreeleela)కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. మొన్నటివరకు గోల్డెన్ లెగ్ అన్న ఆడియన్స్ ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. కారణం.. ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్స్ కావడమే.
వాటిలో స్కంద, ఎక్స్ట్రా, ఆదికేశవ, గుంటూరు కారం సినిమాలు ఉన్నాయి. మంచి హైప్ తో ఈ సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. అయినప్పటికి ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టితో సినిమాలు చేస్తున్న శ్రీలీల.. తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది.
ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే?
కోలీవుడ్ ప్రముఖ కథానాయకుడు అజిత్ హీరోగా ‘మార్క్ ఆంటోనీ’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇది నిర్మితం కానుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం శ్రీలీలను వరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని.. కథ నచ్చడంతో అంగీకారం తెలిపిందని పేర్కొంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కు తెలుగులో ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.ఇన్నేళ్లకు ఆ సమయం వచ్చింది. టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టు గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మేకర్స్ ఆమెను కలిసి స్టోరీ కూడా చెప్పినట్లు సమాచారం. అందుకు ఈ అమ్మడు నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఇక మీదట అయిన మంచి ప్రాజెక్ట్ లు ఎంచుకుని సినిమాలు చేస్తే తప్ప..శ్రీలీల సినీ కెరీర్ నిలబడే చాన్సు తక్కువ స్థాయిలో ఉంది. మరి అజిత్ తో హిట్ పడితే మాత్రం కోలీవుడ్ లో కొన్నాళ్ళు పాగా వేయడం మాత్రం గ్యారంటీ.
ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Super Excited to be associated with Dear #AjithKumar #AK SIR ❤️ once again in this Movie #GoodBadUgly
— DEVI SRI PRASAD (@ThisIsDSP) March 14, 2024
& 1st time with my dear brother @Adhikravi ???
And of course as always with our beloved Dynamic Production House @MythriOfficial ?❤️#RaviYelamanchi sir & #NaveenYerneni… https://t.co/P8Ls5zRkX7