
మాస్ హీరో గోపీచంద్(Gopichand), దర్శకుడు శ్రీనువైట్ల(Srinu Vaitla) కాంబోలో 'విశ్వం' (Viswam) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్..రెండిటితో రూపొందిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.‘మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా..నాకు గీతా ఆర్ట్స్..ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు’’ వంటి కామెడీ పంచ్‌లు బాగా పేలాయి. ఇక ఈ సినిమాలో ‘వెంకీ’ మూవీ తరహా ట్రైన్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
టీజర్ మొత్తం మీద హైలైట్ అంటే వైఎస్ జగన్ డైలాగును గోపీచంద్ చెప్పడం. 'కొట్టారు... తీసుకున్నాం! రేపు మాకూ టైమ్ వస్తుంది. మేమూ కొడతాం' అని వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన డైలాగును హీరో చేత చెప్పించారు శ్రీను వైట్ల.ఏదేమైనా గోపీచంద్ మార్క్ యాక్షన్‌తో పాటు శ్రీను వైట్ల మార్క్ వినోదం ఉండబోతోందని మేకర్స్ మొదటి నుంచి చెబుతున్నారు.ఈ సినిమాతో అయినా గోపీచంద్ కి, శ్రీను వైట్లకి హిట్ దక్కుతుందేమో చూడాలి.
గోపీచంద్ కెరీర్‌లో ఇది 32వ సినిమా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ స్ట్రైక్ వీడియోకు చక్కని స్పందన లభించింది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.