ఎలిమినేటర్ నుంచి SRH ఔట్.. ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు ఆ ముగ్గురిపై వేటు

ఎలిమినేటర్ నుంచి SRH ఔట్.. ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు ఆ ముగ్గురిపై వేటు

మే 27న న్యూ చండీగఢ్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ముగించింది. లీగ్ స్టేజ్‌లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. నాకౌట్ ఫైట్‌లో మాత్రం చతికిలబడింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లీడర్‌షిప్‌లో ఈ సీజన్‌ అంతా గట్టిగానే పోరాడినా.. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్థిరత్వం లేకపోవడం జట్టుని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. డిసెంబర్‌లో జరగబోయే ఐపీఎల్ 2027 మెగా అక్షన్‌కు (IPL 2027 Mega Auction) ముందు పర్స్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి, టీమ్‌ను రీబిల్డ్ చేయడానికి ఫ్రాంచైజీ కొందరు ప్లేయర్లను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. 

లీజ్ లిస్ట్‌లో ఆ ముగ్గురు: 
* లియామ్ లివింగ్‌స్టోన్ (₹13 కోట్లు):
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ ఏకంగా రూ. 13 కోట్లకి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకుంది. మిడిల్ ఆర్డర్‌లో సిక్సర్ల తుఫాన్ సృష్టిస్తాడని ఫ్యాన్స్ ఆశపడితే.. సీన్ రివర్స్ అయింది. ఈ సీజన్‌లో కేవలం 2 ఇన్నింగ్స్‌లు ఆడిన లివింగ్ స్టోన్.. 7.50 సగటుతో కేవలం 15 రన్స్ మాత్రమే చేశాడు. కీలక సమయాల్లో ఇంపాక్ట్ చూపించడంలో ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో, ఇంత భారీ ప్రైస్ ట్యాగ్ ఉన్న ప్లేయర్‌ను వదిలించుకుని పర్స్ మనీ కాపాడుకోవాలని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది.

* హర్షల్ పటేల్ (₹8 కోట్లు): డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, అనుభవజ్ఞుడైన పేసర్ అని నమ్మి ఎస్ఆర్‌హెచ్ హర్షల్ పటేల్‌ను రూ. 8 కోట్లకు దక్కించుకుంది. కానీ, ఈ సీజన్ అతనికి ఒక పీడకలలా మిగిలింది. ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దానికి తోడు 10.83 ఎకానమీ రేటుతో భారీగా పరుగులు సమర్పించుకోవడం మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. రాబోయే వేలంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ పేసర్స్ తీసుకునేందుకు, హర్షల్‌ను రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

* జయదేవ్ ఉనద్కత్ (₹2 కోట్లు): లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను ఎస్ఆర్‌హెచ్ రూ. 2 కోట్లకు తీసుకుంది. ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు తీసినప్పటికీ.. 10.91 ఎకానమీ రేటుతో ఘోరంగా రన్స్ సమర్పించుకున్నాడు. మిడిల్, డెత్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయడంలో ఉనద్కత్ పూర్తిగా చేతులెత్తేశాడు. పైగా ఐపీఎల్ 2027 సమయానికి అతనికి 36 ఏళ్లు వస్తాయి. యువ ప్లేయర్లు దూసుకొస్తుండటంతో.. ఉనద్కత్‌కు ఐపీఎల్ 2026 చివరి సీజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

* బాటమ్ లైన్: ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి కోర్ ప్లేయర్స్ సాలిడ్ ఫామ్‌లో ఉన్నప్పటికీ, బౌలింగ్ లోపాలు, నిలకడలేమి ఎస్ఆర్‌హెచ్‌ను దెబ్బతీశాయి. మరి ఈ ముగ్గురు అవుట్‌డేటెడ్/అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్లను రిలీజ్ చేసి, డిసెంబర్‌లో జరగబోయే మెగా వేలంలో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి కొత్త ప్లాన్స్‌తో బరిలోకి దిగుతుందో మరీ వేచి చూడాల్సి ఉంది.