ఉప్పల్ లో సన్ రైజర్స్ విధ్వంసం.. ఆర్సీబీ రికార్డు బద్దలు

ఉప్పల్ లో సన్ రైజర్స్ విధ్వంసం.. ఆర్సీబీ రికార్డు బద్దలు

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్స్ ట్రావిస్ హెడ్(62), అభిషేక్ శర్మ(63), క్లాసెన్(80 నాటౌట్), మార్ క్రమ్(42 నాటౌట్)లు పెను విధ్వంసం సృష్టించారు. ముంబై బౌలర్లను ఊచకోత కోస్తూ .. భారీ సిక్సులు, ఫోర్లతో  స్టేడియాన్ని  మోత మోగించారు. దీంతో ముంబై బౌలర్లు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈక్రమంలో ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు సన్ రైజర్స్ బ్యా్ట్స్ మెన్లు. వచ్చిన బ్యాట్స్ మెన్లు వచ్చినట్లు .. ఒకరిని మించి మరోకరు బౌండరీలతో ముంబై బౌలర్లపై విరుచుకుపడడంతో ఐపీల్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి.

 20 ఓవర్లలో 3 మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ లో చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 263 పరుగులతో బెంగళూరు మీద ఈ రికార్డు ఉంది.  ఇక మొదటి 10 ఓవర్లలోనూ అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. 10 ఓవర్లలో ఎస్ఆర్ హెచ్ మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.  అంతకుముందు ముంబై(133/3)పై ఉన్న రికాడ్డును సన్ రైజర్స్ తన పేర లిఖించుకుంది.  

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఎస్ఆర్ హెచ్.. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ధాటికి తొలి 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. 24 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 62 పరుగులు చేసి హెడ్ ఔటయ్యాడు. ఇక్కడ నుంచి అభిషేక్ శర్మ వంతు వచ్చింది. హెడ్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేస్తే అభిషేక్ మాత్రం అంతకు మించి చెలరేగి 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 23బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఈ దశలో మార్కరం కు జత కలిసిన క్లాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 55 బంతుల్లోనే 116 పరుగులు రాబట్టారు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసన్ మొత్తం 34 బంతుల్లో 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో మార్కరం 28 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో మఫాకా 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు.. కోయెట్జ్ నాలుగు ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు.