
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ వారాసిగూడలోని చిలకలగూడ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో శ్రీబాలాజీ హైస్కూల్ స్టూడెంట్స్కు పలు అంశాలపై అవగాహన కల్పించారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సైబర్ నేరాలు, డ్రగ్స్, ఈవ్ టీజింగ్, సూసైడ్ ఘటనలపై అవేర్నెస్ కల్పించారు. కార్యక్రమంలో చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఎస్‌ఐ లు టి.సుధాకర్, కె.రామచంద్రారెడ్డి, హైస్కూల్ కరస్పాండెంట్ ఎం.సుదేశ్ పాల్గొన్నారు.