క్లాట్‌‌‌‌ 2024 ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

క్లాట్‌‌‌‌ 2024 ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌‌‌‌ లా యూనివర్సిటీల్లో ఐదేండ్ల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్‌‌‌‌ లా ఎంట్రెన్స్ టెస్ట్‌‌‌‌ (క్లాట్‌‌‌‌) 2024 ఫలితాల్లో శ్రీచైతన్య ఐఏఎస్‌‌‌‌ అకాడమీ ప్రభంజనం సృష్టించింది. వివిధ కేటగిరీల్లో అకాడమీ విద్యార్థులు అత్యధికంగా స్టేట్‌‌‌‌, ఆలిండియా ర్యాంకులు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో కె.వినోత్న స్టేట్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ సాధించాడు. ఎన్‌‌‌‌.సాయి రాహుల్‌‌‌‌ స్టేట్‌‌‌‌ 3వ ర్యాంకు, షేక్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ ఆసీఫ్‌‌‌‌ స్టేట్‌‌‌‌ 5వ ర్యాంకు, ఎ.హర్షవర్ధన సాయి 10, కె.స్వరూప్‌‌‌‌ 11, డి.హర్ష 14, జి.నేహ 18

ఎం. రోహిత్‌‌‌‌ 25, బి.హేమలత 30, బి.అభిలాష్‌‌‌‌ స్టేట్‌‌‌‌ 41వ ర్యాంకుతో పాటు టాప్‌‌‌‌ 50లోపు ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని విద్యా సంస్థలు తెలిపాయి. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో 85వ ర్యాంకు, 123, 470, 482, 547, 864, 1052, 1287, 1516, 2225, 3137, 3798, 3914, 4282, 6897, 8571 వంటి బెస్ట్‌‌‌‌ ర్యాంకులు తమ స్టూడెంట్స్‌‌‌‌ సాధించారని విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, ఇన్ఫినిటీ లెర్న్‌‌‌‌ కో ఫౌండర్‌‌‌‌‌‌‌‌ సుష్మ తెలిపారు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్‌‌‌‌ క్లాట్‌‌‌‌ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు