శ్రీచైతన్య ఇన్ఫినిటీ లెర్న్ నుంచి ఏఐ ఆధారిత మెంటార్

శ్రీచైతన్య ఇన్ఫినిటీ లెర్న్ నుంచి ఏఐ ఆధారిత మెంటార్
  • ఏఐఎన్ఏ పేరుతో ఆవిష్కరణ 

హైదరాబాద్: శ్రీచైతన్య విద్యాసంస్థలు తమ ఇన్ఫినిటీ లెర్న్ ప్లాట్ ఫామ్ నుంచి నూతన ఆవిష్కరణ ఏఐఎన్ఏ (ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ నర్చరింగ్ అసిస్టెంట్)ను గురువారం విడుదల చేసింది. ఏఐఎన్ఏ అనేది భారత్ కు చెందిన మొట్టమొదటి వాయిస్–ఫస్ట్ ఏఐ ఆధారిత మెంటార్ అని శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సీఈఓ, డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. సరైన సాధనాలు, సాంకేతిక కలిసి వచ్చినప్పుడు నేర్చుకోవడం నిజమైన మార్పుని తెస్తుందని చెప్పారు. 

ఏఐఎన్ఏ వేగవంతమైన సమాధానాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం, ప్రేరణ అందిస్తూ విద్యార్థుల అసలైన సామర్థ్యాన్ని వెలికితీస్తుందని పేర్కొన్నారు. ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపక సీఈఓ ఉజ్వల్ సింగ్ మాట్లడుతూ.. ఏఐఎన్ఏ కేవలం ఉత్పత్తి మాత్రమే కాదని వివరించారు. గూగుల్ క్లౌడ్, ఐఐఐటీ–హైదరాబాద్ సహకారంతో రూపొందించిన ఈ టెక్నాలజీ 96.7% కచ్చితత్వంలో సమాధానాలు ఇస్తుందని వెల్లడించారు. ఇంగ్లీషుతో పాటు తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందన్నారు.