
హైదరాబాద్, వెలుగు: నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డీసీ కాన్ఫరెన్స్లో శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ శుక్రవారం వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్‌కు సుమారు 30 దేశాలకు చెందిన 475 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. వీరిలో 67 మంది ఇండియా నుంచి పాల్గొన్నారని, ఇందులో 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులేనని ఆమె పేర్కొన్నారు. ఇటీవల నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లోనూ శ్రీ చైతన్య 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని వరల్డ్ నంబర్‌వన్‌గా, చాంపియన్‌గా నిలిచినట్టు చెప్పారు.
వీటిలో వరల్డ్ థర్డ్ ప్రైజ్10, సెకండ్ ప్రైజ్4, ఫస్ట్ ప్రైజ్3 ఉన్నాయని, ఇవే కాకుండా 43 ప్రాజెక్టులు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని చెప్పారు. ఐఎస్డీసీ కాన్ఫరెన్స్లో ఆర్టిస్టిక్ మెరిట్ కేటగిరీలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీమ్శ్రీ చైతన్య టీమేనని చెప్పారు. శ్రీ చైతన్య స్కూల్ గ్రూప్ మాత్రమే 14 ఏండ్లుగా క్రమం తప్పకుండా ఐఎస్డీసీ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ఆమె అభినందించారు.