హైదరాబాద్లో వైభవంగా జగన్నాథ రథయాత్ర

హైదరాబాద్లో వైభవంగా జగన్నాథ రథయాత్ర

మియాపూర్, వెలుగు : మియాపూర్​ఇస్కాన్ టెంపుల్​ఆధ్వర్యంలో శనివారం స్థానికంగా నిర్వహించిన శ్రీజగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. చందానగర్ నుంచి మొదలైన రథయాత్ర మదీనాగూడ, అల్విన్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, జేపీ నగర్ మీదుగా విశ్వనాథ్​గార్డెన్ వరకు సాగింది. దారిపొడవునా ప్రసాదం పంపిణీ చేశారు.భక్తులు సంకీర్తనలు, భజనలు, మహిళ కోలాటాలు, ఇస్కాన్ ప్రభుజీలు ప్రచనాలు కొనసాగాయి. భక్తులు ఉత్సహంగా రథాన్ని లాగారు.

అనంతరం విశ్వనాథ గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. ఇస్కాన్ కమ్యూనికేషన్ డైరెక్టర్, న్యూ ఢిల్లీ యుదిష్టర్ గోవింద్ దాస్, ముంబై టెంపుల్ అధ్యక్షులు కమల్ లోచన దాస్, తిరుపతి టెంపుల్ అధ్యక్షులు రేవతి రమణ దాస్, మియాపూర్ టెంపుల్ అధ్యక్షులు శ్రీరామ్ దాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు రవి కుమార్ యాదవ్, సంపత్, విష్ణువర్ధన్ యాదవ్, గోపరాజు శ్రీనివాస్, ఇస్కాన్ సభ్యులు దేవిశెట్టి శ్రీనివాస్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.