
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ లో విఫలమైంది. మంగళవారం (సెప్టెంబర్ 23) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్లు విజృంభించడంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. కామిందు మెండీస్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. హుస్సేన్ తలత్, హారిస్ రౌఫ్ తలో రెండు వికెట్లు తీసుకున్నాడు. అబ్రార్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. పాక్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ బౌలర్లు చెలరేగారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికి కుశాల్ మెండీస్ ను అఫ్రిది గోల్డెన్ డక్ గా ఔట్ చేశాడు. మూడో ఓవర్లో మరో ఓపెనర్ నిస్సంక (8)ను పెవిలియన్ కు పంపడడంతో లంక జట్టు ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో అసలంక, కుశాల్ పెరీరా (15) చిన్న భాగస్వామ్యం నెలకొల్పిన పాక్ ఈ జోడీని ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండనివ్వలేదు. ఆరో ఓవర్లో హరీస్ రౌఫ్ పెరీరాను ఔట్ చేసి లంక జట్టును కష్టాల్లోకి నెట్టాడు.
►ALSO READ | IND A vs AUS A: చివరి నిమిషంలో అర్ధాంతరంగా తప్పుకున్న అయ్యర్.. ధృవ్ జురెల్‌కు ఇండియా ఏ కెప్టెన్సీ
పవర్ ప్లే ముగిసేసరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. పవర్ ప్లే లో పరుగులు వేగంగా రాబట్టిన శ్రీలంక మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. ఇక పవర్ ప్లే తర్వాత మొత్తం పాకిస్థాన్ హవా కొనసాగింది. 8 ఓవర్లో హుస్సేన్ తలత్ వరుస బంతుల్లో అసలంక (20), శనక (0) వికెట్లను పడగొట్టి లంక జట్టును పీకల్లోతు కష్టాల్లో పడేశాడు. హసరంగా (13)ను అబ్రార్ బౌల్డ్ చేయడంతో 80 పరుగుల వద్ద శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. చివర్లో కామిందు మెండీస్ హాఫ్ సెంచరీ చేసి జట్టు స్కోర్ ను 130 పరుగులకు చేర్చాడు.
Sri Lanka recover well from 80-6 📈#PAKvSL LIVE ⏩ https://t.co/N8MULEjW3A pic.twitter.com/1cyEiWVN6Q
— ESPNcricinfo (@ESPNcricinfo) September 23, 2025