లంకతో మ్యాచ్.. భారత్ టార్గెట్ వైట్‌వాష్‌ 

లంకతో మ్యాచ్.. భారత్ టార్గెట్ వైట్‌వాష్‌ 

పల్లెకెలె: శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళలు.. గురువారం చివరి వన్డేలోనూ గెలిచి ప్రత్యర్థిని వైట్‌వాష్‌ చేయాలని భావిస్తున్నారు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే స్మృతిమంధాన (6) నిరాశపరిచింది. 15 ఓవర్లకు వికెట్ నష్టానికి భారత్ స్కోర్ 72/1. భాటియా(20), షెపాలీ వర్మ(43) క్రీజులో ఉన్నారు. రెండో వన్డేలో బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించిన క్రమంలో..ఆఖరి పోరులో భారత్‌ను నిలువరించడం శ్రీలంకకు శక్తికి మించిన పనే.