
ఆసియా కప్ సూపర్-4లో శ్రీలంకతో చివరి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 26) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్షదీప్ సింగ్.. ఆల్ రౌండర్ శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రానా ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించారు. మరోవైపు శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఆల్ రౌండర్ కరుణరత్నే స్థానంలో లియాంగేని జట్టులోకి తీసుకొని వచ్చింది.
ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ టోర్నీలో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. చివరి మ్యాచ్ లోనూ లంకను చిత్తు చేసి ఫైనల్ కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని చూస్తుంది. మరోవైపు ఇప్పటివరకు సూపర్-4లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన శ్రీలంక చివరి మ్యాచ్ లో ఇండియాకు షాక్ ఇవ్వాలని చూస్తుంది.
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
►ALSO READ | IND vs WI: ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌కు బిగ్ షాక్.. 150 కి.మీ ఫాస్ట్ బౌలర్ గాయంతో ఔట్
శ్రీలంక (ప్లేయింగ్ XI):
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, జనిత్ లియానాగే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, నువాన్ తుషార