V6 News

గట్టి భద్రత మధ్య గౌహతి చేరుకున్న లంక టీమ్‌‌

గట్టి భద్రత మధ్య గౌహతి చేరుకున్న లంక టీమ్‌‌

గౌహతి: ఇండియాతో మూడు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌ కోసం శ్రీలంక టీమ్‌‌.. గురువారం గౌహతికి చేరుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో .. గట్టి భద్రత మధ్య టీమ్‌‌ను నేరుగా హోటల్‌‌కు తరలించారు. ఇండియా టీమ్‌‌ మాత్రం బ్యాచ్‌‌ల వారిగా శుక్రవారం ఇక్కడికి చేరుకోనుంది.  రెండు జట్లకు ఆప్షనల్‌‌ ప్రాక్టీస్‌‌ సెషన్స్‌‌ ఉన్నాయని అస్సాం క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (ఏసీఏ) వెల్లడించింది. సీఏఏ ఆందోళనల కారణంగా కర్ఫ్యూ విధించడంతో డిసెంబర్‌‌లో జరగాల్సిన అండర్‌‌–19, రంజీ మ్యాచ్‌‌లపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, టూరిస్ట్‌‌లు రాష్ట్రానికి వస్తున్నారని ఏసీఏ సెక్రటరీ దేవాజిత్‌‌ సైకియా తెలిపాడు. ఈనెల 10 నుంచి ఖేలో ఇండియా గేమ్స్‌‌ను కూడా నిర్వహిస్తున్నామని, ఇందులో 7 వేల మంది పార్టిసిపేట్‌‌ చేస్తున్నారన్నాడు. 39 వేల 500 టిక్కెట్లకు గానూ 27 వేలు ఇప్పటికే అమ్ముడుపోయాయని చెప్పాడు. ఆదివారం తొలి టీ20, 7, 10న తర్వాతి రెండు టీ20లు వరుసగా ఇండోర్‌‌, పుణెలో జరుగుతాయి.

Sri Lankan team arrives in Guwahati for T20I series against India