వేములవాడలో శ్రీ రామనవమి ఉత్సవాలు ప్రారంభం

వేములవాడలో శ్రీ రామనవమి ఉత్సవాలు ప్రారంభం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు గురువారం ఏకాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయమే ప్రధాన అర్చకుడు శరత్​ నేతృత్వంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం నిర్వహించారు. మరోవైపు శ్రీ సీతారామచంద్రస్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి 8  రోజుల పాటు స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

భీమన్న ఆలయంలో పంచాంగ శ్రవణం 

వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ ఉప ప్రధాన అర్చకుడు  చంద్రగిరి శరత్​ శర్మ పంచాగ శ్రవణం వివరించారు. పంచాంగ శ్రవణంలో విప్‌‌‌‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌, ఆలయ ఈవో  రమాదేవి పాల్గొని పండితులు, అర్చకులను సన్మానం నిర్వహించారు.