
పద్మారావునగర్, వెలుగు: పద్మారావునగర్ లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ్ ఆశ్రమ్లో శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు బుధవారం శ్రీసాయిబాబా ఆలయంలో శ్రీసాయి నరసింహాస్వామి సేవ నిర్వహించగా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. వారికి అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో సద్గురు డాక్టర్ సాయి కుమార్ జీ భక్తులకు శ్రీసాయి దివ్య లీలలపై ప్రవచనాలు చేశారు. పూజల్లో ఆలయ ఉత్తరాధికారి శ్రీకీర్తిమా పాల్గొన్నారు.
నేడు గురుపౌర్ణమి..
గురువారం గురుపౌర్ణమి సందర్బంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.