వెంకటేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా శ్రీనిధి శెట్టి.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో

వెంకటేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా శ్రీనిధి శెట్టి.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో

‘కేజీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫ్రాంచైజీతో ఆకట్టుకున్న హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనిధి శెట్టి.. ఇటీవల తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డకు జంటగా ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  తాజాగా మరో క్రేజీ సినిమాలో ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకుంది. వెంకటేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 

హారిక హాసిని క్రియేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు జంటగా కనిపించబోతోంది శ్రీనిధి శెట్టి. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఆమెకు వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ చెప్పారు మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.