నామీద ఆరోపణలతో షాక్ అయ్యా : బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్

నామీద ఆరోపణలతో షాక్ అయ్యా : బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్
  •     మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: తనపై వచ్చిన ఆరోపణలతో షాక్​ అయ్యానని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్​ నేత శ్రీనివాస్​గౌడ్ అన్నారు. ఆ అమ్మాయి బాబాయి తనతో మాట్లాడారని, ఎలాంటి సంబంధం లేదని చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక ఉద్యోగి తప్పు చేశారని చెబితే అతన్ని వెంటనే ఉద్యోగంలో నుంచి తీసివేశానని తెలిపారు. 

బీజేపీ, కాంగ్రెస్‌‌లో కొందరు లోఫర్ గాళ్లు ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ అమ్మాయి ఏదో మాట్లాడితే రెండు పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. బీఆర్ఎస్‌‌కు ప్రజల్లో ఆదరణ ఉందని, తాను సమస్యలపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తన వ్యక్తిత్వం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చీప్​ట్రిక్స్‌‌ చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని, లాయర్లతో దీనిపై చర్చిస్తున్నానని ఆయన వివరించారు.