ఎలాంటి అధారాలతో కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు: శ్రీనివాస్ గౌడ్

ఎలాంటి అధారాలతో కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు: శ్రీనివాస్ గౌడ్

ఎమ్మెల్సీ కవిత  సెల్ ఫోన్లు ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.  కవిత ఫోన్లు ధ్వంసం చేశారని మంత్రి కిషన్ రెడ్డి  ఎలాంటి అధారాలతో ఆరోపణలు చేశారని ప్రశ్నించారు.   మార్చి 21న రెండోరోజు విచారణకు హాజరైన కవిత 9 ఫోన్లను ఈడీకి సమర్పించారు.. మరి దీనికి  కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని శ్రీనివాస్ గౌడ్  డిమాండ్ చేశారు. కవితకు కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. ఇది వందకోట్ల స్కామ్ అయితే  నీరవ్ మోడీ ఎన్ని కోట్ల స్కామ్  చేశారని ప్రశ్నించారు.  లేని అధారాలను చూపించి కవితను వేధిస్తున్నారని తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తునే ఉన్నారని  అన్నారు. అదానీ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటే కేంద్రం ఏం చేస్తుందని శ్రీనివాస్ గౌడ్  ప్రశ్నించారు.  లలీత్ మోడీ, విజయ్ మాల్యా వీదేశాల్లో ఎంజాయ్  చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కేంద్రానికి చాతనైతే వీదేశాల్లో దాక్కున్న అవినీతిపరులును తీసుకుని రావాలని అన్నారు.