
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని చివ్వేంల మండలం జగనతండాకి చెందిన ఏఈ ధరావత్ సుందర్(35) ఈ ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత నెల రోజుల క్రితమే సుందర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో తన సొంత గ్రామానికి వచ్చాడు. 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండి కరోనాను జయించాడు. ఆ తరువాత యధావిధిగా విధుల్లో చేరాడు. గురువారం నాడు రాత్రి 9 గంటలకు విధుల్లో భాగంగా సుందర్ శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సుందర్ చిక్కుకున్నాడు. సుందర్‌కు భార్య ప్రమీల, ఇద్దరు కూతుళ్లు మానస్వి, నిహస్వి ఉన్నారు. అతని తండ్రి నాగేశ్వరరావుకోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు.