ఆ పవర్ చేతిదా? కుర్చీదా?

ఆ పవర్ చేతిదా? కుర్చీదా?


సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాదు, టైటిల్ కూడా డిఫరెంట్‌‌గా ఉండేలా చూసుకుంటాడు శ్రీవిష్ణు. ఎప్పుడూ అచ్చ తెలుగు టైటిల్స్‌‌కే ఇంపార్టెన్స్‌‌ ఇస్తుంటాడు. త్వరలో ‘భళా తందనాన’ అనే మరో డిఫరెంట్‌‌ మూవీతో రానున్నాడు. కేథరీన్ థ్రెసా హీరోయిన్‌‌గా నటిస్తోంది. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి డైరెక్ట్ చేస్తున్నాడు. నిన్న ఈ మూవీ టీజర్‌‌‌‌ను నాని సోషల్‌‌ మీడియా ద్వారా లాంచ్‌‌ చేసి, టీమ్‌‌కి ఆల్‌‌ ద బెస్ట్ చెప్పాడు. ‘రాక్షసుడిని చంపేందుకు దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి. నేను మామూలు మనిషిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌‌తో టీజర్‌‌‌‌ మొదలైంది. ఇందులో తను జర్నలిస్ట్‌‌గా నటిస్తున్నాడు. ‘నిజాయతీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మేన్‌‌కి కూడా రిస్కే’.. ‘లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు’ వంటి బలమైన డైలాగ్స్‌‌తో టీజర్‌‌‌‌ ఆకట్టుకుంది. ‘సీఎం కుర్చీలో కూర్చున్న ఎవ్వరైనా, ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్‌‌‌‌నే మార్చే యొచ్చు. అంటే ఆ పవర్ చేతిదా? కుర్చీదా?’ అనే డైలాగ్ హైలైట్. మణిశర్మ బ్యాగ్రౌండ్‌‌ స్కోర్ ఇంటెన్సిటీని పెంచింది. సాయి కొర్రపాటి సమర్పణలో రజని నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో థియేటర్స్​లో విడుదల కానుంది.