రివ్యూ: రాజ రాజ చోర

రివ్యూ: రాజ రాజ చోర

రన్ టైమ్: 2 గంటల 29 నిమిషాలు
నటీనటులు: శ్రీ విష్ణు,మేఘా ఆకాష్,సునయన,గంగవ్వ,రవిబాబు,తనికెళ్ల భరణి,శ్రీకాంత్ అయ్యంగార్,అజయ్ ఘోష్ తదితరులు
సినిమాటోగ్రఫీ:వేద రామన్ 
మ్యూజిక్: వివేక్ సాగర్
ఎడిటర్ : విప్లవ్
నిర్మాతలు: టి.జి విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్
రచన,దర్శకత్వం: హసిత్ గోలి
రిలీజ్ డేట్: ఆగస్ట్ 19.2021

కథేంటి?

భాస్కర్ (శ్రీవిష్ణు) ఒక జిరాక్స్ షాప్ లో పని చేస్తుంటాడు. కానీ సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ అని అబద్ధం చెప్పి సంజన ( మేఘా ఆకాశ్) ను ప్రేమిస్తాడు. అవసరాల కోసం దొంగతనాలు చేస్తాడు. అయితే భాస్కర్ కి ఇదివరకే పెళ్లి అయిందనీ, ఒక కొడుకు కూడా ఉన్నాడని సంజనకి తెలుస్తోంది. మరి భాస్కర్ కి నిజంగానే పెళ్లి అయిందా ? విద్య ( సునైన) భాస్కర్ కి ఏమి అవుతుంది ? చివరకు అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుందన్నదే కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

శ్రీవిష్ణు నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మంచి ఈజ్, కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేస్తాడు.మేఘా ఆకాష్ క్యూట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.సునయన కు మంచి రోల్ దక్కింది.సీరియస్ గా ఉండే పాత్రలో బాగా చేసింది.రవిబాబు ,తనికెళ్ల భరణి రాణించారు.గంగవ్వ,శ్రీకాంత్ అయ్యంగార్,అజయ్ ఘోష్ తదితరులు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ వర్:

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ సాగర్ అందించిన పాటలు బాగున్నాయి.ముఖ్యంగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాకు ప్లస్ అయ్యాడు.సినిమా మూడ్ ను పర్ఫెక్ట్ గా క్యారీ చేశాడు.ఆర్ట్ వర్క్,ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. విప్లవ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది.కొన్ని కామెడీ పంచ్ లు బాగా పేలాయి.

విశ్లేషణ: 

‘‘రాజ రాజ చోర’’ డీసెంట్ ఎంటర్ టైనర్.మంచి కామెడీ మరియు ఎమోషనల్ జర్నీ తో ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ లో హిలేరియస్ కామెడీ ఉంది.ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ ల్యాగ్ ఉంది. కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఎక్కువైందని చెప్పాలి.కానీ ఫర్వాలేదు.ఓవరాల్ గా ఒకసారి హ్యాపీ చూడొచ్చు.డైరెక్టర్ హసిత్ గోలి కొత్తవాడే అయినా చాలా బాగా రాసుకున్నాడు.ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా రాసుకొని సెకండాఫ్ ఎమోషనల్ టచ్ ఇవ్వాలని ప్రయత్నం చేశాడు.ఆ కనెక్ట్ బాగుంది.కాకపోతే సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ద పెట్టాల్సింది.దీని వల్ల కొన్ని సీన్లు నీరసంగా అనిపిస్తాయి.క్లైమాక్స్ వరకు బాగుంది కాబట్టి ప్రేక్షకులు సంతృప్తి తో బయటకు వస్తారు. నటీనటుల పర్ఫార్మెన్స్, బలమైన క్యారెక్టరైజేషన్ లు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,హిలేరియస్ ఫస్టాఫ్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఒకసారి ఫ్యామిలితో కలిసి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

బాటమ్ లైన్: డీసెంట్ రాజా..