దృశ్యం 2 డైరెక్టర్‌‌పై రాజమౌళి ప్రశంసలు 

V6 Velugu Posted on Mar 15, 2021


విక్టరీ వెంకటేశ్ నటించిన దృశ్యం మూవీ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళ మాతృక దృశ్యం సినిమాకు డైరెక్షన్ వహించిన జీతూ జోసెఫ్ తెలుగులోనూ తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా తీసిన దృశ్యం 2 రీసెంట్‌గా విడుదలైంది. ఈ చిత్రాన్ని జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి చూశారు. సినిమా చూసిన తర్వాత రాజమౌళి చేసిన మెసేజ్‌‌ను జీతూ జోసెఫ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాజమౌళికి థ్యాంక్స్ చెప్పిన జోసెఫ్.. ఇది తనకు గౌరవనీయమన్నారు.

సదరు మెసేజ్‌‌లో దృశ్యం తనను చాలా ఆకట్టుకుందని జక్కన్న రాసుకొచ్చాడు. ‘హాయ్ జీతూ, నేను రాజమౌళి. ఫిల్మ్‌ డైరెక్టర్. దృశ్యం 2ను కొన్ని రోజుల కిందటే చూశా. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. వెంటనే తొలి పార్ట్ చూశా. ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్ ప్రతిదీ అమేజింగ్. ముఖ్యంగా సినిమాలో రైటింగ్ మరోస్థాయిలో ఉంది. ప్రపంచస్థాయిలో ఉంది. ఫస్ట్ పార్ట్ మాస్టర్‌‌పీస్. ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు మీ నుంచి ఆశిస్తున్నా’ అని జీతూ జోసెఫ్‌‌పై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. 
 

Tagged SS Rajamouli

Latest Videos

Subscribe Now

More News