Job Alert: 13 వందల 40 ఉద్యోగాలు.. బీటెక్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసి ఉంటే అప్లై చేసుకోండి

Job Alert: 13 వందల 40 ఉద్యోగాలు.. బీటెక్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసి ఉంటే అప్లై చేసుకోండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13 వందల 40 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 21. రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అక్టోబర్ 27 నుంచి 31 మధ్యలో రాత పరీక్ష ఉంటుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది.

  • పోస్టుల సంఖ్య: 1340
  • పోస్టులు: జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ
  • వయో పరిమితి: 18 నుంచి 30 ఏళ్ల వయసు
  • అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 30.
  • లాస్ట్ డేట్: జులై 21 .
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 
  • పరీక్ష తేదీ: 2025, అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు.
  • శాలరీ: బేసిక్ పే-35వేల 400 రూపాయలు, ఇన్-హ్యాండ్ శాలరీ-44 వేల నుంచి 52 వేలు
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్ సైట్లో చూడగలరు.