
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఫేజ్ XIII సెలెక్షన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 23.
- పోస్టులు: 2402(ఫేజ్ XIII సెలెక్షన్ పోస్ట్)
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 02.
- లాస్ట్ డేట్: జూన్ 23.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర అభ్యర్థులకు రూ.100.
- సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఎగ్జామ్ ప్యాటర్న్: మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్(25 ప్రశ్నలు), జనరల్ అవేర్ నెస్(25 ప్రశ్నలు), క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు) ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.
- ఎగ్జామ్ సెంటర్స్: తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఎలూరులో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
- ఎగ్జామ్ తేదీలు: 2025, జులై 24 నుంచి ఆగస్టు 04 వరకు