ఎస్టీ గురుకులాలకు నిధుల ఇబ్బంది లేదు : అడిషనల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ నటరాజ్‌‌‌‌‌‌‌‌

ఎస్టీ గురుకులాలకు నిధుల ఇబ్బంది లేదు : అడిషనల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ నటరాజ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎస్టీ గురుకులాలకు నిధుల ఇబ్బంది లేదని అడిషనల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ నటరాజ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని సోమవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ‘వెలుగు’లో ప్రచురితమైన “ఎస్టీ గురుకులాలకు నిధుల కటకట” కథనంపై ఆయన స్పందించారు.

వంట మనుషులు, సహాయక సిబ్బందిని అవుట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీల ద్వారా నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతి సంస్థకు ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది వేతనాల కోసం రూ.40 వేల చొప్పున అందజేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర ఖర్చుల కోసం ఇప్పటికే ఒక్కో సంస్థకు రూ.53,400 చొప్పున నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. పాత భవనాల మరమ్మతులను ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ బృందాలతో వేగంగా చేపడుతున్నామన్నారు.