
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ –2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7,565 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21.
పోస్టుల సంఖ్య: 7,565.
పోస్టులు: కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు 4,408, కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పురుషులు (ఎక్స్ సర్వీస్‌మెన్, ఇతరులు) 285, కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పురుషులు (ఎక్స్ సర్వీస్‌మెన్ కమాండో) 376, కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు 2,496.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10+2 (సీనియర్ సెకండరీ) లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. పీఈ & ఎంటీ నిర్వహించే తేదీ నాటికి పురుష అభ్యర్థులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్( మోటార్ సైకిల్ లేదా కారు) కలిగి ఉండాలి. లెర్నింగ్ లైసెన్స్‌ను పరిగణనలోకి తీసుకోరు.
వయోపరిమితి: 2025, జులై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు 2000, జులై 2వ తేదీ కంటే ముందు గానీ 2007, జులై 1 తర్వాత గానీ జన్మించిన వారై ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 22.
లాస్ట్ డేట్: అక్టోబర్ 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.100.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యురెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్(పీఈ అండ్ ఎంటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ALSO READ : రైల్వేలో ఉద్యోగాలు..
పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ): కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఇంగ్లిష్/ హిందీ మాధ్యమంలో ఉంటాయి. 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్–ఏలో జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, పార్ట్–బిలో రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, పార్ట్–సిలో న్యూమరికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలు 15 మార్కులకు, పార్ట్–డిలో కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యునికేషన్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ తదితర అంశాల నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
ఎగ్జామ్ తేదీ: 2025, డిసెంబర్/ 2026, జనవరి.