శంషాబాద్ ఎయిర్పోర్టులో..ల్యాండింగ్ చేస్తుండగా ఒకవైపు ఒరిగిన ఫ్లైట్..సమయస్ఫూర్తితో పైకి తీసుకువెళ్లిన పైలట్

శంషాబాద్ ఎయిర్పోర్టులో..ల్యాండింగ్ చేస్తుండగా ఒకవైపు ఒరిగిన ఫ్లైట్..సమయస్ఫూర్తితో పైకి తీసుకువెళ్లిన  పైలట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టుకు వస్తున్న స్టార్ ఎయిర్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. నలుగురు సిబ్బందితోసహా 30 మందితో కూడిన ఫ్లైట్ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్​నుంచి బయలుదేరింది.8.15 గంటలకు పైలట్ శంషాబాద్ ఎయిర్​పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ల్యాండింగ్ చేస్తుండగా విమానం ఒకేవైపుకు ఒరిగిపోయింది.

ముప్పును గుర్తించిన పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని తిరిగి ఆకాశంలోకి తీసుకెళ్లాడు. విమానం పక్కకు ఒరుగుతున్న టైంలో ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. విమానం సురక్షితంగా గాలిలోకి ఎగరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత పైలట్ విమానాన్ని బెంగుళూరు తీసుకెళ్లి అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు.  

సీఎం ప్రయాణిస్తున్న ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు

హైదరాబాద్‌‌‌‌లో ప్రతికూల వాతావరణం కారణంగా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌‌‌‌ వస్తున్న విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్‌‌‌‌ చేశారు. రేవంత్‌‌‌‌రెడ్డి సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో బయలుదేరారు.  ఫ్లైట్ 9 గంటలకు శంషాబాద్​ఎయిర్​ పోర్టులో ల్యాండ్​కావాల్సి ఉండగా.. ఆ టైంలో  హైదరాబాద్‌‌‌‌లో వర్షం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.