ఆర్టీసీ కార్గో సర్వీసులు ప్రారంభం

ఆర్టీసీ కార్గో సర్వీసులు ప్రారంభం

కార్గో సర్వీసులను ఆర్టీసీ శుక్రవారం ప్రారంభించింది. సంస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇవి అందు బాటులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కార్గో సేవలను ప్రారంభించాలని నాలుగు నెలలుగా వాయిదా వేస్తూ వచ్చారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో సర్వీసులను మొదలుపెట్టారు. ప్రస్తుతం తెలంగాణ ఫుడ్స్ కు సంబంధించి అంగన్‌వాడీ సెంటర్ల కు ఈ సర్వీసుల ద్వారా సరుకులు రవాణా చేస్తున్నారు. అవసరం ఉన్న చోట డిపోకు ఒక్కో కార్గో బస్సును అందుబాటులో ఉంచారు. 58 బస్సులు రెడీ సొంతంగా కార్గో, పార్సిల్‌ సర్వీసులు నడిపి ఆదాయం పొందేందుకు ఆర్టీసీ కార్గో సేవలను తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. మొత్తం 820 బస్సుల దాకా ఇందు కోసం సిద్ధం చేయాలనుకుంది. అయితే.. ప్రస్తుతం 58 బస్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో శుక్రవారం 20 బస్సులను లాంచ్‌ చేశారు. మిగతా బస్సుల్ని ఒకటీ రెండురో జుల్లో ప్రారంభించనున్నారు. తెలంగాణ ఫుడ్స్ కు సంబంధించి బాలామృతం, పాలు, గుడ్లు ఇతర సరుకులను కార్గో బస్సుల్లో తరలిస్తున్నారు. వీటికి ప్రస్తుతానికైతే ఎలాంటి చార్జీలు  లేవని ఆర్టీసీ ఆఫీసర్లు చెబుతున్నారు.