
హైదరాబాద్ లోని సీతారాం బాగ్ నుండి శ్రీరామ నవమి శోభాయాత్ర మొదలైంది.సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యయమశాల వరకు 6.5 కి.మీటర్లు శోభాయాత్ర కొనసాగుతుంది.రెండేళ్ల తరువాత హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుండటంతో భక్తులు భారీగా తరలిరానున్నారు. శోభాయాత్రలో భారీ హనుమంతుడు, భరతమాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ధుల్ పేట్ , జాలీ హనుమాన్, చుడీ బజార్, గౌలి గూడ, మీదుగా హనుమాన్ టేకీడీ లోని హనుమాన్ వ్యయమశాల వరకు శోభాయాత్ర జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి.సీసీ సి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.