
ముషీరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఏటీఎం పేరుతో కాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్ ఓ డమ్మీ ఏటీఎం తయారు చేయించి వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం అంజ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఈ డమ్మీ ఏటీఎంను డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ .. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం దేశాన్ని లూటీ చేశారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండు ఒక్కటేనని విమర్శించారు.
లిక్కర్‌స్కామ్‌లో సీఎం కేసీఆర్ కూతురును ఎందుకు విచారించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సంవత్సరం తిరగకుండానే పిల్లర్లు కుంగిపోవడం ఏమిటని మండిపడ్డారు. ఒక రూపాయి పనిని వెయ్యి రూపాయిలుగా చూపి నాసిరకం మెటిరీయల్ వాడి లక్షల కోట్ల డబ్బును దోచుకున్నారని విమర్శించారు. ‘ఈ శతాబ్దాపు భారీ కుంభకోణం’ అంటూ కేసీఆర్ నోటి నుంచి ఫేక్ కరెన్సీ వచ్చే విధంగా ఈ డమ్మీ ఏటీఎంను తయారు చేయించిన ఆయన వాటిని జనాలకు పంచిపెట్టారు.