రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో జేఈఈ, ఐఐటీ, నీట్ కోచింగ్
ప్రారంభించిన చైర్మన్ సిరికొండ లక్ష్మీనారాయణ
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పూర్తయిన స్టూడెంట్లకు జేఈఈ, ఐఐటీ, నీట్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీని సోమవారం రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ సిరికొండ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సిరికొండ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో జేఈఈ, ఐఐటీ, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తో పాటు ఆరు నుంచి పదో తరగతి స్టూడెంట్లకు ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్ కు ఫౌండేషన్ కోచింగ్ ఉంటుందని తెలిపారు. దీంతో పాటు ఎన్‌టీఎస్‌ఈ, ఒలంపియాడ్కు ప్రత్యేకంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఎంసెట్ కోసం షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కోచింగ్ క్లాసుల కోసం కార్పొరేట్ కాలేజీలో అనుభవం ఉన్న ఆచార్య సముద్రాలను అకడమిక్ డైరెక్టర్‌గా, ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని నియమించామని తెలిపారు. ఫీజులో రాయితీ కోసం ఈ నెల 8న ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు దిల్సుఖ్నగర్లోని రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రామయ్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.