లోకల్ బాడీ ఖాళీలపై ఈసీ షెడ్యూల్

లోకల్ బాడీ ఖాళీలపై ఈసీ షెడ్యూల్
  • ఈ నెల 31న ఎన్నిక.. నార్సింగి, కొల్లాపూర్, కామారెడ్డిలో పదవుల భర్తీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు సీట్లలో ఖాళీగా ఉన్న లోకల్ బాడీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోస్టులను ఈసీ భర్తీ చేయనుంది. ఈ మూడు సీట్లకు బుధవారం ఆయా జిల్లాలో కలెక్టర్లు మీటింగ్ నిర్వహించి ఈనెల 31న ఎన్నిక పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఏవైనా కారణాలతో ఈనెల 31న ఎన్నిక వాయిదా పడితే వచ్చే నెల 1న నిర్వహించాలని షెడ్యూల్‌‌‌‌లో పేర్కొన్నారు.