ఐదు విడతల్లో స్థానిక ఎన్నికలు..ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ..ఆ తర్వాతే పంచాయతీ

ఐదు విడతల్లో స్థానిక ఎన్నికలు..ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ..ఆ తర్వాతే పంచాయతీ

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ . మొత్తం ఐదు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ..మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు వెల్లడించారు.

అక్టోబర్ 9న  ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై..నవంబర్ 11 వరకు పూర్తి కానుంది. అక్టోబర్ 9న షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడించడంతోనే  తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికలు

  • మొదటి విడత అక్టోబర్ 9న నామినేషన్..23న పోలింగ్
  • రెండో విడత అక్టోబర్ 13న నామినేషన్లు..27న పోలింగ్
  • నవంబర్ 11న ఎంపీటీసీ,జెడ్పీటీసీ కౌంటింగ్

పంచాయతీ ఎన్నికలు 

  • మొదటి విడత: అక్టోబర్ 17న నామినేషన్లు..31న పోలింగ్
  • రెండో విడత : అక్టోబర్ 21న నామినేషన్లు..నవంబర్ 4న పోలింగ్
  • మూడో విడత: అక్టోబర్ 25న నామినేషన్లు.. నవంబర్ 8న పోలింగ్, ఫలితాలు
 

షెడ్యూల్

  • అక్టోబర్ 9న నోటిఫికేషన్
  • ఐదు విడతల్లో స్థానిక ఎన్నికలు
  • రెండు విడతల్లో ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు  
  • మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు 
  • అక్టోబర్ ​23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 
  • నవంబర్​11న ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు 
  • అక్టోబర్31, నవంబర్​ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
  • పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు
  •  5749 ఎంపీటీసీ స్థానాలకు  ఎన్నికలు
  • 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు
  • 565 ZPTC స్థానాలకు ఎన్నికలు 
  • 12,773 పంచాయతీలకు ఎన్నికలు
  • ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ ​అమలు